Surprise Me!

Revanth Reddy has praised Sonia Gandhi కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టిన రేవంత్ | Oneindia Telugu

2017-10-30 725 Dailymotion

Revanth Reddy has praised Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu and AICC president Sonia Gandhi on Monday. <br />కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధపడిన రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబుపై పదేపదే ప్రశంసలు కురిపిస్తున్నారు. <br />తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దించేందుకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని ఆయన పదేపదే చెబుతున్నారు. అదే సమయంలో కొందరు ఏపీ, టీడీపీ నేతలు.. కేసీఆర్ నుంచి లబ్ధి పొందుతున్నారని అందుకే టీడీపీని వీడుతున్నట్లు చెప్పారు. <br />రేవంత్ పదేపదే చంద్రబాబును ప్రశంసిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలను పక్కన పెడితే, ఈ ప్రశంసలు ఏపీ కాంగ్రెస్‌కు, వైసిపికి ఇబ్బందికర పరిణామాలని చెప్పవచ్చు. నిత్యం బాబుకు కితాబివ్వడం ద్వారా ఏపీ ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు <br />సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో రేవంత్ రెడ్డి అభిమానులు, అనుచరులతో భేటీ అయ్యారు. ఈ భేటీకి కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. చంద్రబాబును ఆకాశానికెత్తారు. చంద్రబాబుతో పదేళ్ల అనుబంధం కారణంగానే ఆయనను పదేపదే ప్రశంసిస్తున్నారని భావించవచ్చు. అదే సమయంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రశంసించారు.

Buy Now on CodeCanyon